Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ సినిమాతో జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవం: చంద్రమోహన్

 ఎన్టీఆర్‌ సినిమా కారణంగా నాకు చేదు అనుభవం ఎదురైంది. అది నా జీవితంలో మర్చిపోలేను

Chandra Mohan Memories with Ntr and ANR jsp
Author
First Published Nov 11, 2023, 1:03 PM IST | Last Updated Nov 11, 2023, 1:03 PM IST


‘‘నందమూరి తారక రామారావుగారితో నాకు  పెద్దగా నటించే అవకాశాలు రాలేదు. అయితే ఓసారి ఎన్టీఆర్‌ సినిమా కారణంగా నాకు చేదు అనుభవం ఎదురైంది. అది నా జీవితంలో మర్చిపోలేను. ఆయన పక్కన తమ్ముడిగా ముందు నన్ను అనుకుని చివరి నిమిషంలో బాలకృష్ణను తీసుకున్నారు. ఆ క్షణం ఎంతో బాధపడ్డా. అయితే, ఆ తర్వాత అదే సినిమా తమిళంలో రీమేక్‌ చేసినప్పుడు ఎంజీఆర్‌ పక్కన తమ్ముడిగా చేసే అవకాశం లభించింది. ఎన్టీఆర్‌ సినిమా సెట్‌లో జరిగిన ఘటన వల్లే.. నాకు ఎంజీఆర్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాతో నాకు తమిళంలో బ్రహ్మాండమైన పేరు వచ్చింది’’ అని చంద్రమోహన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే నాకు నాగేశ్వరరావుగారితో ఎక్కువగా సినిమా అవకాశాలు వచ్చాయి. మేమిద్దరం కలిసి 40 సినిమాలు చేశాం. ఒకేలా ఉండటం వల్ల బహుశా ఆయన పక్కన నన్ను తీసుకునేవారేమో అన్నారు. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (Chandramohan) శనివారం తుదిశ్వాస విడిచారు.  ఈ సందర్బంగా ఆయన జ్ఞాపకాలులో కొన్ని ఇవి..

చంద్రమోహన్ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ ...‘‘నా మొదటి  సినిమా ‘రంగుల రాట్నం’తో మంచి పేరొచ్చింది. నంది అవార్డు కూడా అందుకున్నా. కానీ ఆరు నెలల వరకూ మరో సినిమా లేదు. ఆ తర్వాత  ‘మరుపురాని కథ’, ‘బంగారు పిచ్చుక’ చిత్రాల్లో నటించాను. అటుపైన రెండున్నర ఏళ్లవరకూ వేషాలే లేవు. మా గురువు బి.ఎన్‌.రెడ్డిగారు నన్ను హీరోగా తప్ప చేయవద్దన్నారు. అందుకే మొదట్లో చిన్న చిన్న వేషాలు వచ్చినా అంగీకరించలేదు. 

ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడానికి మొహమాటం. మద్రాసు వెంకటనారాయణ రోడ్డులో ఉన్న పార్కులో పస్తులతో పడుకున్న రోజుల్ని ఇప్పటికీ  మరిచిపోలేను. ఒకదశలో మద్రాసు వదిలి వెళ్లిపోదామనే అనుకున్నాను. కానీ పట్టుదల పెరిగి అక్కడే ఉండి తేల్చుకుందామని నిర్ణయించుకున్నాను. నన్ను నేను పోషించుకోవాలి. ప్రేక్షకులు నన్ను మరిచిపోకూడదు. అందుకే హీరోగానే నటించాలనే నా పట్టుదలను వీడి అన్ని రకాల వేషాలు వేసి ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాను. అలా చేయడం వల్లే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండగలిగాననిపిస్తోంది’’ అని ఓ సందర్భంలో చంద్రమోహన్‌ పంచుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios