హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. ఆక్సిజెన్, ఆరడుగుల బులెట్, పంతం లాంటి చిత్రాలు గోపీచంద్ కు నిరాశనే మిగిల్చాయి. చాణక్య చిత్రంతో వరుస ప్లాపులకు బ్రేక్ వేయాలని గోపీచంద్ భావిస్తున్నాడు. 

గోపీచంద్ రా ఏజెంట్ గా నచాణక్య చిత్రంలో నటించాడు. సీనియర్ నటుడు నాజర్, బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. రా ఏజెంట్ గా గోపీచంద్ లుక్, ట్రైలర్ లో చూపిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. 

పాకిస్తాన్ నేపథ్యంలో అండర్ కవర్ ఆపరేషన్ లో పాల్గొనే పవర్ ఫుల్ ఏజెంట్ గా గోపీచంద్ నటించాడు. ఈ తరహా స్పై థ్రిల్లర్ చిత్రాలు క్లిక్ అయితే మంచి విజయం సాధిస్తాయి. చాణక్య చిత్ర ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రదర్శించారు. సినిమాపై సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం. 

ఫస్ట్ హాఫ్ లో 15 నిమిషాలు సినిమా స్లో. మిలినదంతా బావుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంది. 

 

ఇప్పుడే చాణక్య చిత్రం చూశా. చాలా బావుంది. ఎవరూ మిస్ కావద్దు.

 

చాణక్య చిత్రం బాగాలేదు. గోపీచంద్ ఫామ్ లోకి రావాలంటే మరోసారి చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నటించాలి.

 

చాణక్య చిత్రానికి యుఎస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

 

చాణక్య చిత్రం బావుంది. గోపీచంద్ నటన, వేగంగా సాగే స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు.