Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ మీద పెద్ద బరువే, ఎలా మోస్తాడో ఏంటో

  విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇక రిలీజ్ డేట్ కరెక్ట్ గా నెల రోజులే  ఉంది. 

Challenge for NTR to promote Devara film to Hindi audiences jsp
Author
First Published Aug 28, 2024, 11:49 AM IST | Last Updated Aug 28, 2024, 11:49 AM IST


ఎన్టీఆర్‌ హీరోగా డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవర’.  ఈ క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్టు ‘దేవర’ సెప్టెంబర్ 27 న పార్ట్‌ 1ను రిలీజ్‌ చేస్తున్నారు.  ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత హీరో ఎన్టీఆర్‌- డైరెక్టర్‌ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కావటంతో  క్రేజ్ ఓ రేంజిలో ఉంది. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు.  విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇక రిలీజ్ డేట్ కరెక్ట్ గా నెల రోజులే  ఉంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసారు. ఆ బ్రేక్ ఈవెన్ ని సాధించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎన్టీఆర్ మీద ప్రెజర్ లు, బరువులు అనే చెప్పాలి.

తెలుగులో ఈ చిత్రం ప్రమోషన్స్ స్పీడుగానే జరుగుతున్నాయి. మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ సోలోగా ప్యాన్ ఇండియా లీగ్ లోకి ప్రవేశిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో వచ్చిన క్రేజ్ ని ఈ సినిమా కొనసాగించాల్సి ఉంది. దాంతో హిందీ బెల్ట్ లోనూ ఈ సినిమాను భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాగా అక్కడ ప్రమోషన్స్ ప్రారంబించకపోవటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఎన్టీఆర్ మీదే అక్కడ ప్రమోషన్ భాద్యతలు మొత్తం పెట్టదలుచుకున్నారట. సైఫ్ ని హైలెట్ చేస్తే అతని సినిమాగా మారుతుంది. అందుకే ఎన్టీఆర్ అక్కడ మెయిన్ సెంటర్స్ లో అయినా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలి అంటున్నారు. 

అలాగే అనిరిథ్ వంటి టాప్ టెక్నిషియన్ ఉన్నా తమిళంలో ప్రమోషన్స్ జరగటం లేదు.  వీటితో పాటు కర్ణాటకలో ఎన్టీఆర్ కు ప్రత్యేక మార్కెట్ అభిమానులు ఉన్నారు. కాబట్టి బెంగుళూరులో మినిమం ప్రెస్ మీట్ అయినా పెట్టి ఎన్టీఆర్ హాజరు కావాల్సి ఉంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ ఇలా ఐదు డిఫరెంట్ మార్కెట్ లను ఎన్టీఆర్ కవర్ చేయాల్సి ఉంది. టైమ్ చూస్తే 30 రోజులే ఉంది. ఆ ప్రాజెక్టు ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మార్కెట్ కు బాగా కీలకమైనది. తర్వాత ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా, అలాగే వార్ 2 కు కూడా ఇప్పుడు దేవర తో వచ్చే మార్కెట్ యాడ్ కానుంది. 

 రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు.  దీనికి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రంలో తండ్రి పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన  వర్క్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.  

‘దేవర’(Devara) సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి.  కీలక పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios