మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సూర్యం సినిమాలో హీరోయిన్‌గా నటించిన అందాల భామ సెలీనా జైట్లీ. తెలుగులో కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించిన ఈ ఆఫ్గనిస్థాన్ బ్యూటీ తరువాత పూర్తిగా బాలీవుడ్‌ కే పరిమితమైంది. హిందీలో స్టార్ హీరో సినిమాలో కూడా నటించిన సెలీనా కొంత కాలానికే తన ఫిలిం కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. మోడలింగ్ రంగం నుంచి వెండితెర మీదకు అడుగుపెట్టిన ఈ బ్యూటీ చివరగా 2012లో రిలీజ్‌ అయిన విల్‌ యూ మ్యారీ మీ? అనే సినిమాలో కనిపించింది.

ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపార వేత్త పీటర్‌ హాగ్‌ను వివాహం చేసుకున్న ఆమె సినిమాలకు దూరమయ్యాకు. గ్లామర్‌ ప్రపంచానికి దూరంగా ఓ సాధారణ గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తున్న సెలీనా ప్రస్తుతం యూరప్‌లో సెటిల్ అయ్యింది. అయితే ఇన్నేళ్ల తరువాత సెలీనా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చింది. 2011లో సెలీనా నటించిన సీజన్స్‌ గ్రీటింగ్స్‌ అనే షార్ట్ ఫిలింను ఓటీటీ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం జీ 5లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ భావోద్వేగ సందేశాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా ఆమె `2011లో నేను సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో చివరి పోస్ట్ చేశాను. ఇన్నేళ్ల తరువాత తిరిగి సినిమాలకు సంబంధించి ఓ పోస్ట్ షేర్ చేయటం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. అది కూడా ప్రపంచమంతా ఇలా ఓ వైరస్‌ కారణంగా అల్లకల్లోలం అవుతున్న తరుణంలో చేయాల్సి రావటం బాధగా ఉంది. ఈ సమయంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. నేను వివాహం చేసుకొని యూరప్‌లో సెటిల్ అయ్యాను. నా సినిమాల మీద రివ్యూ ఇచ్చే నా తల్లిదండ్రులు మరణించారు. నా తదుపరి చిత్రం నేను ముగ్గురు పిల్లల తల్లిని అయ్యాక వస్తుందని ఊహించలేదు` అంటూ తన గతాన్ని అభిమానులతో పంచుకుంది సెలీనా.