స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన 37 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. దీనితో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలయింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన 37 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. దీనితో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలయింది. ఇప్పటికే ట్విట్టర్ లో అల్లు అర్జున్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి విజేత, డాడీ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 

బన్నీ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. తొలి చిత్రమే సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు, జులాయి, సరైనోడు, డీజే, అల వైకుంఠపురములో లాంటి ఘనవిజయాలు అందుకున్నాడు. 

అల్లు అర్జున్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు.. మలయాళంలో కూడా అల్లు అర్జున్ కు విశేషంగా అభిమానులు ఉన్నారు. డాన్సులు, నటన, స్టైల్ లో అల్లు అర్జున్ తనదైన ముద్ర వేశాడు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు. బన్నీ పుట్టినరోజు పురస్కరించుకుని నేడు పుష్ప చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయింది. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు పలువురు సెలెబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…