రవితేజ నటించిన పవర్ చిత్రంతో బాబీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. పవర్ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తెరక్కించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిరాశపరిచినప్పటికీ బాబీ వెనకడుగు వేయలేదు. 

ఎన్టీఆర్ తో జైలవకుశ చిత్రం తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య లతో వెంకీ మామ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాబీ కుమార్తె వైషు పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. 

బర్త్ డే సెలెబ్రేషన్స్ లో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య, బెల్లంకొండ శ్రీనివాస్, రాశి ఖన్నా పాల్గొన్నారు. మరికొందరు సెలెబ్రిటీలు కూడా బాబీ కుమార్తె పుట్టినరోజు వేడుకలో సందడి చేశారు. 

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరక్కుతున్న వెంకీ మామ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.