బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ లో కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న 28 ఏళ్ల క్రిష్ కపూర్ ఆకస్మిక మృతి చెందాడు. చిన్న వయసులోనే క్రిష్ కపూర్ మృతి చెందడంతో అతడి ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ లో విషాదం నెలకొంది. 

క్రిష్ కపూర్ కాస్టింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను పని చేసే చిత్రాలకు అద్భుతమైన నటీనటుల్ని సమకూర్చడంలో దిట్ట. జిలేబి, వీరేయ్ కి వెడ్డింగ్ లాంటి చిత్రాలకు క్రిష్ కపూర్ కాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. 

క్రిష్ కపూర్ బ్రెయిన్ హేమరేజ్ కారణంగా మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు వివరించారు. ముందుగా క్రిష్ కపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై క్రిష్ కపూర్ అంకుల్ క్లారిటీ క్లారిటీ ఇచ్చారు. క్రిష్ కపూర్ బ్రెయిన్ హేమరేజ్ కారణంగానే మరణించినట్లు ఆయన మీడియాతో తెలిపారు. 

క్రిష్ కు గతంలో ఎలాంటి అనారోగ్యం లేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ బ్రెయిన్ హేమరేజ్ కారణంగా సడెన్ గా రక్త స్రావంతో కుప్పకూలిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. క్రిష్ కపూర్ తో అనుబంధం ఉన్న బాలీవుడ్ సెలెబ్రిటీలు అతడికి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.