Asianet News TeluguAsianet News Telugu

'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' కలెక్షన్లు దొంగతనం, గోలెత్తిపోతున్నారు!

 థియేటర్ లో దొంగలు పడి వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల మూడు రోజుల కలెక్షన్లను దోచుకెళ్లారు. 

Cash stolen from Ponnuru Sri Lakshmi theatre
Author
First Published Jan 17, 2023, 1:13 PM IST

ఈ ఏడాది సంక్రాంతికి మైత్రి మూవీస్ సంస్థ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యిన సంగతి తెలిసిందే. అవే ‘వీర సింహారెడ్డి’, వాల్తేర్ వీరయ్య’. ఈ రెండు సినిమాలను భారీ రేట్లకు అమ్మింది మైత్రి సంస్థ. అందరూ రెగ్యులర్ బయ్యర్స్ కావడంతో మైత్రి అడిగినంత మొత్తానికే సినిమాను కొన్నారు. ఆంధ్ర రెండు సినిమాలు కలిపి రూ.70 నుంచి రూ.75 కోట్ల మేరకు కట్టారు. నైజాంలో రూ.33 కోట్లకు అమ్మారు.  తొలి నాలుగు రోజులు, మూడు రోజుల ట్రెండ్ చూస్తుంటే కుమ్మి పారేస్తోంది. కలెక్షన్స్ కు కొదవలేదు..అందరికీ లాభాలే అని తేలిపోయింది. దాంతో బయ్యర్లు, థియేటర్ ఓనర్స్ అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఓ థియేటర్ ఓనర్ కు మాత్రం ఆ ఆనందం ఆవిరై పోయింది. అందుకు కారణం తమ థియేటర్ లో దొంగతనం జరగటమే. వివరాల్లోకి వెళితే..

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ థియేటర్ లో దొంగలు పడి వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల మూడు రోజుల కలెక్షన్లను దోచుకెళ్లారు. సంక్రాంతి పండగ కావడంతో బ్యాంకులకు సెలవు ఉంది. రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్లను థియేటర్ల నిర్వాహకులు తమ వద్దే ఉంచుకోవటమే అందుకు కారణం అంటున్నారు. బ్యాంకులు తిరిగి తెరుచుకున్న తర్వాత బ్యాంకులో వేయవచ్చని థియేటర్లలోని లాకర్లలో డబ్బు ఉంచారు. అయితే ఇదే అదనుగా దొంగలు చేతులకు పని చెప్పారు.

ఇక దొంగతనం  విషయంపై వెంటనే థియేటర్ నిర్వాహకులు పొన్నూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని చోరీ ఎలా జరిగింది ఎవరు చేసి ఉంటారు థియేటర్ లో పని చేసే వారిలో ఎవరైనా దొంగలు ఉన్నారా థియేటర్ సిబ్బంది సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రెండు సినిమాలకు అదిరిపోయే  కలెక్షన్లు వచ్చాయని ఆనందపడే లోపే ఇలా జరగడంతో థియేటర్ నిర్వాహకులు గోలెత్తిపోతున్నారు.  

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. తొలిరోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలెట్టింది.  ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 3 రోజుల్లోనే 108 కోట్లను రాబట్టింది. ఈ కథకి చిరంజీవితో పాటు రవితేజ కూడా తోడవడంతో, సెకండాఫ్ నుంచి ఎమోషన్ ను కూడా తోడుచేసుకుని నడుస్తుంది. ఇక దేవిశ్రీ పాటలు ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి. 

బాలయ్య హీరోగా మైత్రీ బ్యానర్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహా రెడ్డి సినిమా, ఈ నెల 12వ తేదీన విడుదలైంది. తొలి రోజునే ఈ సినిమా 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. నాలుగు రోజుల్లో ఈ సినిమా 104 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.  బాలకృష్ణ కెరియర్ లోనే తొలిరోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. బాలయ్య ద్విపాత్రాభినయం .. యాక్షన్ .. ఎమోషన్ .. బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ .. ఇవన్నీ కుదరటం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios