పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన తాజా చిత్రం 'భీమ్లానాయక్' గత వారం ప్రేక్షకుల ముందువచ్చిన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను రాబడుతూ అన్నీ చోట్లా బ్రేకీవెన్ టార్గెట్‌ను రీచ్ అవుతూ దూసుకెళుతోంది.
పెద్ద తెరపై పవన్ కల్యాణ్ ప్రభంజనం కొనసాగుతోంది. వీకెండ్, మహా శివరాత్రి అనే తేడా లేకుండా భీమ్లానాయక్ కుమ్మేసాడు. ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లా నాయక్ బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. త్వరలోనే వంద కోట్ల మైలు రాయిని అందుకోనుందని ట్రేడ్ వర్గాలు ఫిక్సై పోయింది. అయితే సినిమా రిలీజన ఇన్ని రోజులుకు ఈ సినిమాపై ఓ వివాదం చెలరేగింది. అయితే ఆ వివాదంలో అంత బలం లేదని, జనం సోషల్ మీడియాలో కామెంట్స్ ,ఫన్ చేస్తున్నారు. ఆ వివాదం మొదలెట్టిన వాళ్లు ఖచ్చితంగా వైయస్సార్పీ పార్టీకి చెందిన వాళ్లై ఉంటారని అన్నారు. ఈ లోగా తెలంగాణాలోనూ ఈ సినిమాపై కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే...
భీమ్లానాయక్ సినిమాలో కుమ్మరి కులస్థుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఓ సన్నివేశం ఉందని, వెంటనే దాన్ని తొలగించాలని.. లాలాపేట్ పోచమ్మ దేవాలయ సభ్యుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. తామూ ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రాన్ని ఓ సన్నివేశంలో రానా కాలితో తన్నడం కుమ్మరులను కించపరిచే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, వెంటనే ఈ సన్నివేశాలను సినిమాలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మరో ప్రక్క గుంటూరుకు చెందిన శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం భీమ్లా నాయక్ సినిమా పై కేసు పెట్టారు. రానా కుమ్మరి చక్రాన్ని తన్ని పడగొట్టే సన్నివేశాన్ని మేకర్స్ తమ వర్గీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రీకరించారని ఆ సన్నివేశాన్ని తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సినిమాలోని ఒక సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నడంతో.. మాకు అన్నం పెట్టే కుల చక్రాన్ని కాలితో తన్నడం బాధ అనిపించిందని, కుమ్మరి వారు అంటే అంత చులకన గా చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేలని , లేకపోతే తీవ్ర పరిణామాలు మేకర్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని పురుషోత్తం డిమాండ్ చేశారు.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
