ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ పై తమిళనాడులో పోలీస్ కేసు నమోదైంది. సంఘ సంస్కర్త పెరియార్‌పై తప్పుడు ప్రచారం చేశారనే కారణం చేత రజినీకాంత్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడిగా ఉంటున్న మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రజిని కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. .  1971లో పెరియార్ నిర్వహించిన ఒక ర్యాలీలో పవిత్రమైన సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని అది చాలా బాధాకరమైన విషయమని రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో సూపర్ స్టార్ మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా రజిని చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదాలకు దారి తీశాయి. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు మణి ఈ వ్యాఖ్యలను ఖండించారు. పోలీసులకు పిర్యాదు చేసి వెంటనే రజినీకాంత్ ఈ విషయంపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇకపోతే రీసెంట్ గా రజినీకాంత్ హీరోగా నటించిన దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఏఆర్.మురగదాస్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలను అందించాడు. నెక్స్ట్ సూపర్ స్టార్ రజిని... శివ దర్శకత్వంలో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు.