ప్రముఖ దర్శకుడు ఎఆర్ మురగదాస్ డైరక్షన్ లో రూపొందుతున్న  'దర్బార్'  చిత్రంలో  రజనీకాంత్  పోలీసు అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ పోలీస్ పాత్ర కాదు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. రజనీకాంత్ ఏ పాత్ర చేసినా అందులో తనదైన స్టైల్ ని నింపటమే కాదు..ఎంతో కొంత విభిన్నత ఉండాలని చూస్తారు.

అదే విధంగా ఇప్పుడు ఆయన చేస్తున్న దర్బార్ చిత్రంలోనూ ఓ డిఫరెంట్ రోల్ ని ప్లే చేస్తున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ తో సినిమాకి బాగానే క్రేజ్ వచ్చింది.  సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల అయ్యే ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  ఈ నేపద్యంలో ఈ చిత్రం తెలుగులోనూ భారిగానే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

దాంతో తెలుగు రాష్ట్రాల్లో  ‘దర్బార్’ చిత్రానికి బిజినెస్ బాగానే జరిగినట్టు తెలుస్తుంది.‘దర్బార్’ చిత్రానికి తెలుగులో 14.2 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.  సినిమా హిట్ అయ్యితే రజనీ సినిమాకు 14 కోట్లు రావటం అనేది పెద్ద విషయమేమీ కాదు. అయితే రజనీ గత చిత్రాలు భాక్సాఫీస్ వద్ద బిల్డప్ ఎక్కువ..బిజినెస్ తక్కువ అన్నట్లు సాగుతున్నాయి.

దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది..మురగదాస్ ఏమన్నా మ్యాజిక్ చేసాడా, రొటీన్ గా చుట్టేసాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్థార్ నయనతార హీరోయన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగు , తమిళ , హిందీ భాషల్లో ఈ  పొంగల్ కు విడుదలకానుంది.