ఒక్క సారి కెరీర్ లో స్లో అయితే మళ్లీ పికప్ అవటానికి చాలా టైమ్ పడుతుంది. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పడితే కానీ తిరిగి ఫామ్ లోకి రాలేరు. ఫామ్ లో లేని సినిమా కు అన్ని కష్టాలే. ప్రొడక్షన్ దగ్గర నుంచి బిజినెస్ దాకా అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదురౌతాయి. ‘డిస్కోరాజా’ ఇప్పుడు అలాంటి ఫేజ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాని మొదట క్రిసమస్ కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు జనవరి 24, రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేద్దామనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.

అందుకు కారణం సినిమాకు పెట్టిన బడ్జెట్ తగ్గ బిజినెస్ ఆఫర్స్ రాకపోవటమే అని తెలుస్తోంది. రవితేజ వరస ఫెయిల్యూర్స్ లో  ఉండటంతో చాలా తక్కువ రేట్లకు సినిమాని అడగటం నిర్మాతలను కంగారు పెడుతోందిట. ఈ సినిమాకు క్రేజ్ తెస్తే బిజినెస్ అదే అవుతుందనే నమ్మకంతో డిసెంబర్ 6 నుంచి ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఆ రోజు టీజర్ ని వదిలి...దాంతో వచ్చే క్రేజ్ తో కాస్త బిజినెస్ లో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.  

రవితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌  హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి  వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహించారు.

నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ…  రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఓ విన్నూత్న‌మైన ఆంశాన్ని ఈ సినిమా క‌థాంశంగా తీసుకున్నాం. మా బ్యానర్ వాల్యు ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించాం. హైద‌రాబాద్ తో పాటు గోవా, చెన్నై, ల‌డాఖ్, మ‌నాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీక‌రించాం .

ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేసారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ స్వ‌రాలు అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ గా సాయి శ్రీరామ్ వ్య‌వ‌హ‌రించారు. అబ్బూరి ర‌వి ఈ సినిమాకు మాట‌లు అందిస్తున్నారు.  

ప్ర‌ముఖ న‌టుడు బాబీసింహా ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నారు. క‌మీడియ‌న్స్ వెన్నెల‌కిషోర్, స‌త్య త‌దిత‌ర‌లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్నారు అని చెప్పుకొచ్చారు.