#Salaarకు బిజినెస్ సమస్యలా,నిజమెంత?
ప్రభాస్ సినిమా ప్రబాస్ దే. ఆ లెక్కలు వేరే ఉంటాయి. అందులోనూ డంకీ చిత్రం యాక్షన్ సినిమా కాదు. ఆ ఆడియన్స్ వేరు...ఓ రోజు ముందే వచ్చేస్తోంది.

కొద్ది వారాలుగా మీడియా మొత్తం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salar) వాయిదా గురించే కబుర్లు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28నుంచి కిస్మస్ కు వాయిదా పడిన తర్వాత ప్రమోషన్స్ మాత్రం స్పీడు అందుకోలేదు. అయితే ఇప్పటికే ఉన్న ఈ క్రేజ్ చాలు అన్నట్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కిస్మస్ ఎప్పుడు వస్తుంది,సలార్ ను ఎప్పుడు చూస్తామా అంటూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా సలార్ పై సోషల్ మీడియాలో ఓ ప్రాపగాండా ప్రారంభమైంది. ఈ సినిమా బిజినెస్ లో సమస్యలు వచ్చాయని ఆ వార్తల సారాంశం.
అదేమిటంటే..సలార్ హిందీ డీల్‌కు ఇప్పుడు క్యాన్సిల్ అయిందని. వాస్తవానికి సలార్ హిందీ హక్కులను ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొన్ని నెలల కిందటే తీసుకుంది. అయితే ఇప్పుడా సంస్దవాళ్లు మేము ఇంత రేటు పెట్టి తీసుకున్నాం కానీ మీరు రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదాలు వేసారు..అలాగే షారూఖ్ డంకీ పోటికి వస్తోంది...అంతంత రేట్లు మాకు వర్కవుట్ కావు అన్నట్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడిన ఈ సమయంలో వేరే పెద్ద సంస్ద వచ్చి మళ్లీ ఈ సినిమా రైట్స్ తీసుకుని రిలీజ్ చేయటం అంటే ఇబ్బందే అంటున్నారు. కాకపోతే ఈ వార్తలో నిజముండే అవకాసం లేదనిపిస్తోంది.
ఎందుకంటే ప్రభాస్ సినిమా ప్రబాస్ దే. ఆ లెక్కలు వేరే ఉంటాయి. అందులోనూ డంకీ చిత్రం యాక్షన్ సినిమా కాదు. ఆ ఆడియన్స్ వేరు...ఓ రోజు ముందే వచ్చేస్తోంది. ఓపినింగ్స్ ఇబ్బంది ఉండదు. యూత్ లో ఎక్కువ శాతం యాక్షన్ ప్రియులే ఉంటారు. అందులోనూ సలార్ కు ఓ రేంజిలో క్రేజ్ ఉంది. దాంతో బీబత్సమైన ఓపినింగ్స్ వస్తాయి. ఈ క్రమంలో నిజంగా హిందీ డిస్ట్రిబ్యూటర్ వెనక్కి వెళ్లాడా లేక పుట్టించిన వార్తా అనేది సందేహం కలుగుతోంది.
‘సలార్’ను నిర్మిస్తున్న హోంబాలే ఫిల్మ్ మాత్రం ఈ వార్తలపై ఇప్పటివరకూ ఏమీ రెస్పాండ్ అవలేదు.మరో ప్రక్క ‘సలార్’ వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతోషంగా లేరని టాక్. ఎడిటింగ్ టేబుల్ ముందు కూర్చొన్న ఆయన అనుకున్న విధంగా కొన్ని షాట్స్ రాలేదట. దీంతో వాటిని మళ్లీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు పంపి చేయిస్తున్నారట. ఏదమైనా సలార్ వార్తల్లో నిజానిజాలు నిర్మాణ సంస్ద మాత్రమే చెప్పాలి.
ఇక ప్రభాస్‌ను డైనోసార్‌గా పోలుస్తూ విడుదల చేసిన ‘సలార్’ గ్లింప్స్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. విదేశాల్లో టికెట్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. ‘సలార్: సీజ్ ఫైర్’ (Salaar: Part 1 Ceasefire)కు ఓపినింగ్స్ ఓ రేంజిలో ఉంటాయనేది నిజం. ఈ దీపావళికి సల్మాన్ ‘టైగర్3’ రాబోతోంది. తమిళంలో ‘అయలాన్’, ‘జపాన్’, ‘జిగర్తాండ2’ రాబోతున్నాయి. వీటి తర్వాత రిలీజ్ అయ్యే పెద్ద సినిమా సలార్ మాత్రమే.