టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. మహేష్ బాబు - అల్లు అర్జున్ ఇద్దరు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా 100కోట్ల షేర్స్ ని దాటేసి అందరికి షాకిచ్చింది.

ఇక ఫైనల్ గా అల వైకుంఠపురములో ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ముఖ్యంగా అమెరికాలో సినిమా 2.8మిలియన్ డాలర్స్ ను అందుకొని సైరా ఆల్ టైమ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఆరు రోజుల్లో 104కోట్ల షేర్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల పోస్టర్ ని రిలీజ్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక వేగంగా బన్నీ 100కోట్ల షేర్స్ అందుకున్నాడు.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 133కోట్లు. సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఇంకా కొద్దీ దూరంలోనే ఉంది. ప్రస్తుతం సినిమా అయితే పాజిటివ్ టాక్ తోనే నడుస్తోంది. వీకెండ్ లో కలెక్షన్స్ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ తో కొనసాగుతోంది అంటే సినిమా ఈ ఆదివారం ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ అందుకోగలదనే టాక్ వస్తోంది. మరీ బన్నీ ఈ రికార్డును ఎంతవరకు కొనసాగిస్తాడో చూడాలి.

 అల.. వైకుంఠపురములో డైలాగ్స్