పాలటిక్స్  కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ మూవీ పవన్ ప్లాన్ చేసారు.  ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిగతా రెండు సినిమాలు ఏ సమస్యా లేవు కానీ...క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా  కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఊహించని విధంగా  ఈ సినిమాకు ఓ కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. అదే బ‌డ్జెట్ విషయంలో ఇబ్బందులు ఎదురౌతున్నట్లు సమాచారం.

మొదట ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లు అని అంచనా వేసారు. ఈ వందకోట్లలో పవన్ కు రెమ్యునేషన్ గా 50 కోట్లు ఇవ్వనున్నారు. మిగతా యాభై కోట్లలో సినిమాని పూర్తి చేయాలి. అయితే ఇది పీరియడ్ చిత్రం కావటంతో యాభై కాస్తా ఎనభై దగ్గర కు వెళ్తోందిట. ఈ సినిమాకు భారీ సెట్స్ అవసరం అని, అందుకోసమే దాదాపు ముప్పై కోట్లు దాకా ఖర్చు పెట్టాలని అంచనా వేసారట. దానికి తోడు ఈ సినిమాలో భారీగా స్టార్ కాస్టింగ్ ఉండబోతోందిట. వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న క్రిష్ ...ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడదలుచుకోలేదట.

తను కాంప్రమైజ్ అయితే మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ అవుతుందని భయపడుతున్నారట. అంతేకాకుండా ఈ సిసిమాకు హై ఎండ్ టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నారట.  కాకపోతే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడుతోంది. ఇలా బడ్జెట్ పెరిగిపోతే బిజినెస్ ఆ స్దాయిలో చేయాలి. రిస్క్ పెరుగుతుంది. దాంతో క్రిష్ ని పిలిచి నిర్మాత ఖచ్చితంగా చెప్పేసారట. ఈ సినిమాకి వీలైనంత‌గా బ‌డ్జెట్ త‌గ్గించాల‌ని అన్నారట. అలాగని ఏదో చుట్టేసినట్లు సినిమా ఉండకూడదు. క్వాలిటీ తగ్గ కూడదు. అవన్నీ చూసుకుంటూ... ఎక్కడ బడ్జెట్ కు కోత పెట్టచ్చో అని చూస్తున్నారట.  

అలాగే ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే ఓ క్లాసిక్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో పవన్ పేరు వీరు అని దాంతో పాటు ఈ సినిమా కథకు కూడా ‘విరూపాక్షి’ టైటిల్ కూడా చక్కగా సరిపోతుందని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.