. బ్రో సినిమా డిజాస్టర్ అంటూ ఈ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రెస్ మీట్లో ఆయన చదవడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఈ నేపధ్యంలో నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు.
పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రో సినిమా లో కమెడియన్ పృథ్వీ పోషించిన శ్యాంబాబు పాత్ర అంతటా చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందనేది అందరూ ఒప్పుకునే అంశమే. యధావిధిగా చిత్రటీమ్ ఈ ప్రచారాన్ని ఖండించినా కూడా ప్రేక్షకులైతే అది అంబటిని టార్గెట్ చేస్తూ పెట్టిన పాత్ర అని ఫిక్సయిపోయారు. అంబటి కూడా మొదట ఈ క్యారెక్టర్ విషయంలో కొంచెం సరదాగా, వ్యంగ్యంగానే స్పందించారు. అయితే తాజాగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి త్రివిక్రమ్ కు వార్నింగ్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్‌ను పెళ్లిళ్లు అంటూ కొంచెం గట్టిగానే టార్గెట్ చేశారు. బ్రో సినిమా డిజాస్టర్ అంటూ ఈ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రెస్ మీట్లో ఆయన చదవారు.
పనిలో పనిగా.. బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. “ఆయనొక ఎన్నారై. అమెరికా నుంచి పవన్‌కు వస్తున్న డబ్బు పెద్ద స్కాం. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్ ద్వారా అందిస్తున్నాడు” అని అంబటి కామెంట్స్ చేసారు. ఈ నేపధ్యంలో మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు.
విశ్వప్రసాద్ మాట్లాడుతూ... అసలు తమ సినిమాకు, అంబటికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్రకు మంత్రి అంబటి రాంబాబుకు పోలికే లేదని ఆయన అన్నారు. అసలు శ్యాంబాబు డాన్స్‌కు సంక్రాంతి సంబరాల్లో రాంబాబు వేసిన డాన్స్‌కు సింకే లేదని అన్నారు. శ్యాంబాబు రాజకీయ నాయకుడు కాదని, మ్యూజిక్ ఒక్కటి కాదని.. అన్నీ తేడాగానే ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఒక్క టీ-షర్ట్ మ్యాచ్ అవుతుందని.. దాన్ని పట్టుకుని వివాదం చేయడం కరెక్ట్ కాదన్నారు.
అలాగే ఒకవేళ మంత్రి రాంబాబు తనను కించపరచడానికే ఈ పాత్ర చేశారని ఆయన అనుకుంటే తామేం చేయలేమని నిర్మాత అన్నారు. మంత్రి చేసే ఆరోపణలు తమ చిత్ర ప్రచారానికే ఉపయోగపడతాయని.. తద్వారా తమకు కలెక్షన్లుకూడా పెరుగాయని వ్యాఖ్యానించారు. లేదంటే అంబటి చేసిన వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ కెరీర్‌కు హెల్ప్ అవుతాయని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇకనైనా అంబటి తన విమర్శలు మానుకోవాలని సూచించారు.
