బిగ్ బాస్ సీజన్ 3 కి రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. ఎంతో ఆర్భాటంగా మొదలైన ఈ షోని ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. 17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ షో చివరి దశకి చేరుకునే సరికి షోలో ఐదుగురు కంటెస్టంట్లు మాత్రమే మిగిలారు.

శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీలలో ఓట్ల ప్రకారం శ్రీముఖి, రాహుల్ లు ముందంజలో ఉన్నారు. వీరి మధ్య పోటీ నెలకొంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ ని పంపించిన బిగ్ బాస్ వారికి సర్ప్రైజ్ లు ఇచ్చాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ నుండి ఇద్దరు కంటెస్టంట్లు ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం.

శాటిలైట్ రైట్స్: రిలీజ్ కి ముందే 20కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టిన మన స్టార్ హీరోల సినిమాలు

ఎలిమినేషన్ ప్రాసెస్ కి సంబంధించిన షూటింగ్ ముందే జరిగిపోవడంతో ఈ విషయం బయటకి పొక్కింది. అందరూ ఊహించినట్లుగానే శ్రీముఖి, రాహుల్ ల మధ్య టఫ్ కాంపిటిషన్ చోటుచేసుకుంది.

ఓట్ల విషయంలో కూడా ఇద్దరికీ పెద్ద తేడా లేదని సమాచారం. కానీ శ్రీముఖి విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. షో చూసే ఆడియన్స్ కూడా శ్రీముఖి విన్నర్ అనే కంక్లూజన్ కి వచ్చేశారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇప్పటివరకు షోలో శ్రీముఖికి సంబంధించిన నెగెటివ్ అంశాలు ఎక్కడా కనిపించలేదు. పైగా నాగార్జున కూడా శ్రీముఖికి కాస్త ఫేవర్ గా మాట్లాడడంతో ఆమే గెలుస్తుందని.. ఈ మాత్రం దానికి షో నిర్వహించడం ఎందుకని సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోపై ట్రోలింగ్ జరిగింది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈసారి ట్రోఫీ అమ్మాయికే ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు బయటకి రావడంతో శ్రీముఖి విన్నర్ అనే అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు శ్రీముఖికి షాక్ ఇచ్చి ట్రోఫీ రాహుల్ అందుకోబోతున్నట్లు సమాచారం.ఇప్పటివరకు పోలైన ఓట్లలో రాహుల్ కి ఎక్కువ శాతం ఓట్లు నమోదు కావడంతో అతడినే విన్నర్ గా అనౌన్స్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన షూటింగ్ ఆదివారం నాడు షో ప్రసారమయ్యే రెండు గంటల ముందు నిర్వహించనున్నారు.