చాలా మందికి బ్రహ్మానందం కేవలం హాస్య నటుడుగానే తెలుసు. అంతేకానీ ఆయనలో మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఉన్నారనే విషయం తెలియదు. కరోనా ప్రభావంతో ఇంటి దగ్గరే ఉన్న ఆయన  తనలోని కళను మరోసారి అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేసారు. షూటింగ్స్‌ నుంచి కొంత ఖాళీ దొరికితే ఆయన పలు స్కెచ్‌లు వేస్తుంటానే విషయం తెలియచేసారు. తాజాగా బ్రహ్మానందం కరోనా నియంత్రణ కోసం భారత్‌ చేస్తున్న పోరును ఓ స్కెచ్‌ రూపంలో చూపించి అందరి మన్ననలు పొందుతున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Let’s Fight this together ..!!

A post shared by Raja Goutham (@rajagoutham) on May 2, 2020 at 5:32am PDT

 ఈ మేరకు ఆయన భారత్‌ లాక్‌డౌన్‌ అనే అస్త్రంతో కరోనా వైరస్‌కే భయం తెప్పిస్తున్నట్లు చూపించటం అందరికీ నచ్చుతోంది. ప్రస్తుతం ఆయన వేసిన స్కెచ్‌ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. మరో ప్రక్క కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం కోసం ఏర్పాటు చేసిన సిసిసి కు బ్రహ్మానందం తన వంతు విరాళం ప్రకటించారు. సినీ కార్మికులకు ఆసరాగా ఉండేందుకు రూ.3 లక్షల విరాళం ఇస్తున్నట్టు చారిటీకి తెలిపారు. 

 తన కెరీర్ లో కొన్ని వందల సినిమాల్లో కమిడియన్ గా మెప్పించిన బ్రహ్మానందం ఇటీవల ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో గెస్ట్ రోల్ లో  సందడి చేశారు. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు బ్రహ్మానందం.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తున్నారు. మరాఠిలో మంచి సక్సెస్  సాధించిన ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కుతుంది.