హాస్య నటుడు బ్రహ్మానందం.అరగుండుగా, ఖాన్‌దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్‌ఎంపీగా... ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు తానే సాటి అని నిరూపించిన బ్రహ్మానందం మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆయన మహారాష్ట్రలో కూడా మంచి అభిమానులని సంపాదించుకున్నారని రీసెంట్ గా తెలిసింది.

ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడి పోతూ హాస్యాన్ని పంచుతూ ప్రేక్షకులను ఇప్పటికీ గిలిగింతలు పెడుతున్న హాస్య నటుడు బ్రహ్మానందం.అరగుండుగా, ఖాన్‌దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్‌ఎంపీగా... ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు తానే సాటి అని నిరూపించిన బ్రహ్మానందం మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆయన మహారాష్ట్రలో కూడా మంచి అభిమానులని సంపాదించుకున్నారని రీసెంట్ గా తెలిసింది.

 మహారాష్ట్ర షోలాపూర్‌‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీచేస్తున్న మహేశ్‌‌ కోథేకు తెలుగు కమేడియన్‌‌ బ్రహ్మానందం, బాలీవుడ్‌‌ స్టార్‌‌ స్నేహ ఉల్లాల్‌ మద్దతు తెలిపారు. షోలాపూర్‌ సిటీ సెంట్రల్‌ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన తిరుగుబాటు ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మహేశ్‌ కోటేకు మద్దతుగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, నటీ స్నేహా ఉల్లాస్‌ ఎన్నికల ప‍్రచారంలో పాల్గొన్నారు. ఈ స్టార్లను చూసేందుకు అభిమానులు ఎగబడటం మీడియాలో సంచలన వార్తగా మారింది.

అక్టోబరు 21వ తేదీ సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ క్యాంపైన్ జరిగింది. మహారాష్ట్రలో ఉండే తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నటులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ఈ స్టార్స్ ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటు కోరారు. బై, భివండీలతోపాటు పశ్చిమ మహారాష్ట్రలని షోలాపూర్, పుణే మొదలైన ప్రాంతాలపై వీరు ప్రత్యేకంగా పర్యటించారు.