అనేక  విజయవంతమైన సినిమాలలో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌ పోషిస్తూ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ. గత ముప్పై ఏళ్ళుగా టాలీవుడ్‌లో ప‌లు చిత్రాలు చేస్తూ వ‌స్తున్న ఆయ‌న సీక్రెట్‌గా కుమారుడు వివాహం గోవాలో జరిపారు. బోపాల్ కుటుంబానికి చెందిన ప్రమోద్ వర్మ, పూనమ్ కుమార్తె అనుకృతి దీక్షిత్‌ను బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ వివాహం చేసుకున్నాడు.

గోవాలోని ప్లానెట్ హాలీవుడ్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుక‌కి సంజయ్ స్నేహితులుగా ఉన్న మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.ఇక గతంలో బ్రహ్మజీ కుమారుడి ఒక వివాహం అయ్యి, డైవర్స్ అయ్యింది. ఆయనే స్వయంగా  తన కుమారుడి డైవర్స్ విషయం గురించి సోషల్ మీడియాల చెప్పేశాడు. చెప్పడానికి బాధగా ఉంది. నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి   విడాకులు కూడా తీసుకోవాలనుకుంటున్నారు అన్నారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటా అని  ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంది. ఇప్పుడు ఆ కుర్రాడికే మరో వివాహం చేసారు.ఇక  బ్రహ్మాజీ, తన కుమారుడిని వారసుడిగా వెండితెరకు పరిచయం చేయనున్నాడు. సంజయ్ నటించిన సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి, త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక తన కుమారుడి వివాహాన్ని లో ప్రొఫైల్ లో జరిపించడం వెనుక కారణాన్ని బ్రహ్మాజీ ఎక్కడా వెల్లడించలేదు.