“పుష్ప 2” పూర్తయ్యాక, దర్శకుడు త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ప్రారంభం మధ్య, అల్లు అర్జున్‌కు 6 నుండి 8 నెలల గ్యాప్  ఉంటుంది. ఆ టైమ్ లోనే  ...


ఇండస్ట్రీలో జాతకాలు ప్రతీ శుక్రవారం మారిపోతూంటాయి. అప్పటిదాకా ఎవరికీ పరిచయం లేని వాళ్లు స్టార్స్ అయ్యిపోతూంటారు. ఓ రేంజిలో వెలిగిన వాళ్లు జీరోలు అయ్యిపోతూంటారు. అది పెద్ద పెద్ద డైరక్టర్స్ కే తప్పలేదు. ఇప్పుడు దాదాపు బోయపాటి ఇలాంటి సిట్యువేషన్ నే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో స్టార్ డైరక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. కానీ ఆయనతో సినిమాలు చెయ్యాలంటే ఇప్పుడు హీరోలు ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. మహేష్ వంటి వారు చేయాలనుకున్నా ఆయన రాసే కథలు అలాంటి స్టార్ హీరోలకు సూట్ అవ్వవు. బాలయ్యతో తప్ప మిగతా హీరోలతో పెద్దగా వర్కవుట్ కాలేదు. ఉన్నంతలో బాలయ్య తర్వాత అల్లు అర్జున్ తో ఆయనకి వర్కవుట్ అయ్యింది. 

రీసెంట్ గా మాస్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్న రామ్ పోతినేని ఉత్సాహంతో బోయపాటి డైరెక్షన్లో నటించాడు. బోయపాటి శ్రీనివాస్, రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందిన ‘స్కంద’ సినిమా డిజాస్టర్ అయింది. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద బాంబులా పేలడమే కాకుండా, బోయపాటి కు బ్యాడ్ నేమ్ తెచ్చింది. ఈ సినిమాలో ఎక్కడా లాజికల్ సీన్స్ లేవని అన్నారు. ఈ సినిమా సోషల్ మీడియాలో కామెడీ వస్తువుగా మారింది. దాంతో ఇప్పుడు మరో దర్శకుడుతో సినిమా అనగానే ఖచ్చితంగా బోయపాటి చెప్పే కథ వైపు జాగ్రత్తగా చూస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. 

ఈ క్రమంలో బోయపాటి తన నెక్ట్స్ ప్రాజెక్టు విషయంలో కొంత ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాడు. వాస్తవానికి అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ ప్రాజెక్టు చెయ్యాలనేది బోయపాటి ప్లాన్. అయితే “పుష్ప” తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాంతో తన ఇమేజ్ ని పణంగా పెట్టి బోయపాటితో సినిమా చేయాలా వద్దా అనే విషయంలో అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. నెక్ట్స్ ఎలూగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తారు. ఆ విషయంలో మార్పు లేదు. దాంతో బోయపాటితో చెయ్యాలా అనేది అల్లు అర్జున్ ఇంకా నిర్ణయించుకోలేక పోతున్నాడని సమాచారం. అయితే బన్నీ డేట్స్ ఇవ్వకపోతే బోయపాటి ఏం చేయాలి. మళ్లీ బాలయ్య దగ్గరికే వెళ్లాలి. కానీ అప్పుడు తను బాలయ్యతో తప్పించి హిట్ ఇవ్వలేడు అనే మాట పూర్తి నిజమై పోతుంది. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను, ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాపైనే వర్క్ చేస్తున్నాడు. స్కంద సినిమా ప్రచారంలోనే బన్నీతో సినిమాపై స్పందించాడు బోయపాటి. సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. బోయపాటి ఇప్పుడు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. “పుష్ప 2” పూర్తయ్యాక, దర్శకుడు త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ప్రారంభం మధ్య, అల్లు అర్జున్‌కు 6 నుండి 8 నెలల గ్యాప్ ఉంటుంది. ఆ టైమ్ లోనే ఓ సినిమాని పూర్తి చేయాలని బన్నీ చేస్తే మంచిందే. అయితే బన్నీ, బోయపాటికి ఛాన్స్ ఇస్తాడా అనేది అందరికీ డౌట్ . అయితే, దర్శకుడి బోయపాటి స్టైల్‌ని, మాస్ ఆడియన్స్‌పై ఆయనకున్న అవగాహనన ఇష్టపడి మాత్రం అల్లు అర్జున్ ప్రాజెక్టు ఓకే చేయాల్సి ఉంటుంది.