చెన్నై: సినీ హీరో విజయ్ ఇంటిని బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ దిగ్భాంతికి గురయ్యారు. నిజానికి విజయ్ చెన్నైలోని పెనయూరులో గల ఇంటిలో నివాసం ఉంటారు. అయనకు శాలిగ్రామంలో మరో ఇల్లు ఉంది. 

శాలిగ్రామంలోని విజయ్ ఇంటిని పేల్చి వేస్తామంటూ పోలీసు కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై విజయ్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అయితే, అందులో నిజం లేదని సోదాల్లో తేలింది. 

తప్పుడు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. విల్లుపురం నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తికి మతిస్తిమితం లేదని తెలిపారు. 

పోలీసులు అతని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి, అతన్ని కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. విజయ్ సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా పాపులర్ అనే విషయం తెలిసిందే.