కరోనా భయంతో క్వారెంటైన్‌ లో ఉంటున్న బాలీవుడ్‌ సెలబ్రిటీ లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూనే తమ దైన స్టైల్‌ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతూ ఆ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌, జాన్వీ కపూర్‌ లాంటి వారు తమలోని ఆర్టిస్ట్ ను బయటకు తీస్తున్నారు. మరి కొందరు సెలబ్రిటీలు వర్క్‌ అవుట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు.

ఇంకొందరు విదేశాల్లో తమ క్వారెంటైన్‌ టైం స్పెండ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెల్లా ప్రస్తుతం తను ఈ సోషల్ డిస్టాన్సింగ్ టైంలో ఏం చేస్తుందో అభిమానులతో షేర్ చేసుకుంది. సినిమాల్లో తక్కువగానే కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌ గా ఉంటుంది ఊర్వశీ.  ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్‌ లకు సంబంధించిన ఫోటోలతో పాటు వెకేషన్ అప్‌ డేట్స్‌ ను కూడా ఇస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

తాజాగా ఈ భామ ఓ గ్లామరస్‌ బీచ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. బీచ్‌ లో పూల బికినీ వేసుకొని ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఈ ఊర్వశీ.. `క్వారెంటైన్‌ లో నేను ఇలా ఎంజాయ్‌ చేస్తున్నా` అంటూ కామెంట్ చేసింది. అందాలు ఆరబోస్తూ ఊర్వశీ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ప్రొఫెషనల్‌ కెరీర్‌ విషయానికి వస్తే గత ఏడాది పాగల్‌ పంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊర్వశీ రౌతెలా, ఇప్పుడు వర్జిన్‌ భానుప్రియ సినిమా పనుల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ లకు బ్రేక్‌ పడటంతో ఇలా బీచ్‌ లో ఎంజాయ్ చేస్తుంది.