బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ వయసు 39 సంవత్సరాలు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే అంత వయసులా అనిపించదు. పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ తన ఫిజిక్ ని ఎంతో నాజుకుగా మైంటైన్ చేస్తోంది కరీనా. కరీనా తన షేప్ ని ఎలా మైంటైన్ చేస్తుందనేది చాలా మంది అమ్మాయిలకు డౌట్. 

దానికి ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. కరీనా ఏం తింటుందో ఆమె న్యూట్రిషినిస్ట్ రుజుతా దివాకర్ స్వయంగా వెల్లడించారు. 'గుడ్ న్యూస్' అనే సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో కరీనా కపూర్ నటించి మెప్పించింది. పార్టీ వేర్ ధరించి, స్లిమ్ ఫిజిక్ తో మతిపోగోట్టింది.

ఆ ఫిజిక్ కి ఆమె ఫాలో అయిన ఆహార నియమాలే కారణమని అంటోంది రుజుతా. ఆ పాట షూటింగ్ కి వారం రోజుల ముందు నుండి కరీనా తిన్న ఆహారాన్ని, ఫుడ్ ప్లానింగ్ ని బయటపెట్టింది. ఉదయాన్నే కుంకుమ పువ్వు కలిపిన నల్లటి ఎండుద్రాక్షని బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకుంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో పరాఠా, చట్నీ తింటుంది.

లంచ్ కి ముందు కొన్ని సబ్జా గింటలు తిని కొబ్బరినీళ్లు తాగుతుంది. ఇక మధ్యాహ్న భోజనంగా కేవలం పెరుగన్నం, అప్పడం మాత్రమే తీసుకునేది. ఆ తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాల్ నట్స్, చీజ్ తినేది. సాయంత్రం అరటిపండుతో చేసిన మిల్క్ షేక్,  డిన్నర్ లో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తీసుకుంటుంది. 

పడుకునే ముందు  పాలు లేదా బనానా మిల్క్ షేక్ తాగేదని.. ఆమె న్యూట్రిషినిస్ట్ చెప్పుకొచ్చింది. ఇలా రోజులో ఎనిమిది సార్లు ఆహరం తీసుకుంటూ పద్దతిగా వ్యాయామాలు చేయడం వలన మంచి ఫిజిక్ ని సంపాదించిందని చెప్పారు. కరీనా వారానికి ఐదు గంటలు మాత్రమే జిమ్ చేస్తూ మంచి షేప్ తెచ్చుకుందని వెల్లడించారు.