ఇండియన్ సిల్వా స్క్రీన్ పై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డ్రీమ్ గర్ల్ హేమా మాలిని. 5 శతాబ్దాల నుంచి వెండితెరపై అదే క్రేజ్ ని అందుకుంటున్న ఆమె ఆగస్ట్ 16న 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. దేశ వ్యాప్తంగా అభిమానులు సినీ ప్రముఖులు హేమ మాలినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి సరికొత్త పాఠాలు నేర్పిన షోలే సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు.  ఆమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది అంటే చివరికి ఆమె పేరుతో కూడా సినిమా వచ్చే స్థాయికి వచ్చింది. అప్పట్లో కుర్రకారు డ్రీమ్ గర్ల్ లా హేమ మాలిని ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నారు. 1965లో తెలుగులో పాండవవనవసంలో ఒక చిన్న డ్యాన్సర్ గా మెరిసిన ఆమె చూస్తుండగానే బాలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ గా వెలిగింది.

శ్రీ కృష్ణ విజయంలో రాంబగా కనిపించిన ఆమె తరువాత తెలుగు సినిమాలు ఎక్కువగా చేయలేదు.  చాలా ఏళ్ల తరువాత మళ్ళీ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించరు. కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న హేమ మాలిని కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు.

ఒకానొక సమయంలో హేమ మాలిని డేట్స్ కోసం కూడా బాలీవుడ్ స్టార్ హీరోలు ఎదురుచూడాల్సి వచ్చింది అంటే ఆమె మరో సావిత్రి అని చెప్పవచ్చు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తల్లి పాత్రల్లో కనిపిస్తున్న హేమా మాలిని కేవలం తనకు నచ్చిన సినిమాల్లోనే నటిస్తోంది.