కరోనా వార్తల్లో నిజానికంటే అబద్ధాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అనుమానాలు కొందరిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన సెలబ్రెటిలు కొందరు అశ్రద్ధ వహిస్తుండడంతో నెటీజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక మరికొందరు అనుమానాలు వస్తున్న తరుణంలో అబద్ధపు ప్రచారాల వల్ల ఇబ్బందికి లోనవుతున్నారు. బాలీవుడ్ నిర్మాత రితేష్ సిద్వాని కుటుంబంలో కూడా కరోనా వ్యాప్తి చేందుతోందని కొన్ని ఫెక్ న్యూస్ లు వస్తున్నాయి.

ఈ విషయం గురించి తెలుసుకున్న వెంటనే రితేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రితేష్ మేనకొడలు ఇటీవల లండన్ నుంచి ఇండియాకు వచ్చింది. అయితే ఆమె కాస్త అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించడంతో ఆమె కరోనా భారిన పడినట్లు సోషల్ మిడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని రితేష్ క్లారిటీ ఇచ్చారు.

కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించిన మాట వాస్తవమేనని అయితే ఇంకా తన మేనకోడలి రిపోర్ట్స్ రాలేవని అన్నారు. ప్రస్తుతం తను వైద్యుల పర్యవేక్షణలో ఉందని రిపోర్ట్స్ రాకముందే తనకి కరోనా ఉన్నట్లు వాట్సాప్ లో మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బేబి డాల్ సింగర్ కనిష్క కపూర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. విదేశాలను చుట్టి వచ్చిన ఆమె పలు పార్టీలలో పాల్గొనడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.