అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అసురన్ చిత్రం తమిళ నాట సంచలనాలు సృష్టిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన అసురన్ ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటోంది. ముఖ్యంగా ధనుష్ యువకుడిగా, మధ్య వయస్కుడిగా నటనతో అదరగొట్టేశాడు. 

అసురన్ చిత్రంపై సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అసురన్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా అసురన్  చిత్రాన్ని చూశారు. సినిమాచూశాక అసురన్ చాలా గొప్ప చిత్రం అని పేర్కొన్నారు. 

వెట్రిమారన్ కథని చూపించిన విధానం బాగుంది. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రం ఇది అని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కుల వివక్ష, భూ వివాదాలని కథాంశాలుగా తీసుకుని వెట్రి మారన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 

అసురన్ చిత్రంలో మంజు వారియర్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు.