ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇంతియాజ్ ఖాన్(77) తుదిశ్వాస విడిచారు. ఇంతియాజ్ మృతికి సరైన కారణాలు తెలియడం లేదు. ఆరోగ్య సమస్యలతోనే ఆయన మృతి చెంది ఉండొచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇంతియాజ్ ఖాన్ బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా రాణించారు. 

ఇంతియాజ్ ఖాన్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఇంతియాజ్ ఖాన్ నటుడు జయంత్ కొడుకు. షోలే చిత్రంలో గబ్బర్ సింగ్ గా నటించిన అంజాద్ ఖాన్ కు ఇంతియాజ్ సోదరుడు. ఇంతియాజ్ మృతితో బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

నీ పోర్న్ వీడియోలు ఉన్నాయి.. పోస్ట్ చేస్తా.. నమితకు బెదిరింపులు

బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రి ఇంతియాజ్ మృతికి సంతాపం తెలియజేశాడు. ఇంతియాజ్ ఖాన్ యాదోంకి బారాత్, ధర్మాత్మ, దయావన్, హల్‌చల్, ప్యార్ దోస్త్, గ్యాంగ్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 

ఇంతియాజ్ ఖాన్ అద్భుతమిన నటుడు, మానవతావాది అని జాఫ్రి కొనియాడారు. ఇంతియన్ మృతికి గల కారణాలని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేయాల్సి ఉంది. ఇంతియాజ్ సతీమణి కృతిక నటిగా కొనసాగుతున్నారు. వీరికి అయేషా అనే కుమార్తె సంతానం.