భరత్ అనే నేను సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన నార్త్ బ్యూటీ కియారా అద్వానీ. బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా సౌత్ నుంచి ఆఫర్స్ వస్తే మిస్ చేసుకోవడం లేదు. ముందు కథలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. నచ్చితే చేస్తానని చెబుతోంది. నచ్చకపోతే కుదరదని మొహం మీదే చెప్పేస్తున్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి.

అయితే రీసెంట్ గా ఒక తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్న ఈ భామ అంతా సిద్ధం చేసుకున్న తరువాత చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నెక్స్ట్ కిరణ్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఆ కథలో హీరోయిన్ పాత్రకు కియారా అద్వానీని సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది.

అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకోవడంతో బేబీ సినిమా చేస్తానని చెప్పిందట.  కానీ సినిమా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకొని సినిమా స్టార్ట్ చేయడానికి సిద్దమవుతున్న చిత్ర యూనిట్ కి అమ్మడు పెద్ద షాకిచ్చింది. బాలీవుడ్ లో బిజీగా ఉండడం వల్ల మీ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని నెమ్మదిగా ప్రాజెక్ట్ నుంచి జారుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. ఇక వరుణ్ తేజ్ క్యారెక్టర్ కి తగ్గట్టు బాక్సింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. అందుకోసం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.