మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సత్తా చాటుతోంది. ఈ సినిమా విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

కానీ బాలీవుడ్ క్రిటిక్ సుచరితా త్యాగి ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసింది. సినిమాను భరించలేకపోతున్నానని,కథ బాగానే ఉన్నప్పటికీ నేరేషన్ అసలు బాలేదని కామెంట్ చేసింది. సినిమా మొత్తం చిరంజీవినే చూపించారని, మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేదనిఇష్టంవచ్చినట్లు కామెంట్స్ చేసింది.

ఈ కామెంట్స్ విన్న మెగాస్టార్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన సుచరిత.. తన రివ్యూ గూగుల్ సెర్చ్ లో హై ర్యాంకింగ్ లో ఉందని, అది చూసి అప్సెట్ అయిన చిరంజీవి అభిమానులు నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు.. సుచరిత 'సైరా' పోస్టర్‌లో గుర్రంపై చిరంజీవి ఫొటో బదులు తన ఫొటోను మార్ఫ్ చేసి పోస్ట్ చేశారు. ఆమెకి ట్విట్టర్ లో ఇరవై వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

సుచరిత మాదిరి బాలీవుడ్ లో కమల్ ఆర్ ఖాన్ అనే మరో క్రిటిక్ కూడా ఉన్నాడు. అతడు కూడా తెలుగు, హిందీ భారీ సినిమాల గురించి నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటాడు. ఇక 'సైరా'విషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. మొదటిరోజు 85 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల షేర్ రాబట్టింది.