భారీ బ్యాడ్జెట్ తో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర పై రోజురోజుకి అంచనాల డోస్ స్ట్రాంగ్ అవుతోంది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ మొదటి నుంచి జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.  రన్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొంత కాలంగా శరవేగంగా జరుగుతోంది.

ఈ ఏడాది మార్చ్ లో కుంభ మేళ సందర్బంగా సినిమా టైటిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేసి సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇకపోతే సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అడ్వెంచర్ ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కథలో నాగార్జున పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది.  ఆర్కియాలజిస్ట్ పాత్రలో బ్రహ్మాస్త్ర కథ ఆయనతోనే మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ఆ పాత్రకు సంబందించిన షూటింగ్ కూడా అయిపొయింది.

ఆడియెన్స్ ని నాగ్ పాత్ర మంచి ఫీల్ ని కలిగించి కథలో లీనమయ్యేలా చేస్తుందని టాక్ వస్తోంది. అమితాబ్ సలహా మేరకు నాగ్ ని ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారట. మరి నాగార్జున నార్త్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమాను చిత్ర యూనిట్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలనీ అనుకుంటోంది.  అసలైతే  2019 సమ్మర్ అనంతరం ఆగస్టులో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.

వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

కానీ కొన్ని షెడ్యూల్స్ ఆలస్యం అవుతుండడంతో కరణ్ జోహార్ 2019 క్రిస్మస్ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకోకుండా మళ్ళీ 2020కి షిఫ్ట్ చేశారు. హిందీతో పాటు తెలుగు అండ్ తమిళ్ లో కూడా సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది.