గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగమతి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి అనంతరం అనుష్క శెట్టి చేసిన భాగమతి సినిమా 40కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో మంచి లాభాలను అందించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు పిల్ల జమిందార్ దర్శకుడు అశోక్ దర్శకత్వం వహించాడు.

తమిళ్ అలాగే మలయాళం భాషల్లో రిలీజైన భాగమతి  అక్కడ కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.  ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమా రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుష్క చేసిన పొయాత్రలో భూమి పడ్నేకర్ ఫిక్స్ అయినట్లు సమాచారం.  ఈ సినిమా హక్కులను పొందేందుకు మొదట బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ చాలా మంది పోటీ పడ్డారు.

ఫైనల్ గా టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ సినిమా నిర్మాతలు సినిమాను బాలీవుడ్ లో నిర్మించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలుగులో 30కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమాను నిర్మించారు. ఇక బాలీవుడ్ లో ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ తో డిజైన్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు.  ఇక తెలుగు దర్శకుడు అశోక్ మరోసారి అదే కథను బాలీవుడ్ కూడా డైరెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ దర్శకుడు లొకేషన్స్ సెట్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉన్ని ముకుందన్ చేసిన పాత్రలో ఒక యువ హీరో నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. మరో సౌత్ లో సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న భాగమతి బాలీవుడ్ లో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.