బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. బాలీవుడ్ హాలీవుడ్ అంటూ అమ్మడు అన్ని రకాల ఇండస్ట్రీలలో అవకాశాలను అందుకుంటూ మంచి క్రేజ్ అందుకుంది. చేసేది సపోర్టింగ్ రోల్ అయినా.. ఐటెం సాంగ్ అయినా అమ్మడు తన అందంతో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది.

అయితే రీసెంట్ గా మల్లికా ఎవరు ఊహించని విధంగా బిల్ గేట్స్ తో దర్శనమిచ్చింది.  ప్రపంచంలో అత్యంత ధనిక బిజినెస్ మెన్ అయిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో బేబి ఫోటోకి పోజివ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మల్లిక మహిళా సాధికారిత గురించి పలు ముఖ్యమైన అంశాలని మాట్లాడిందట. ఇకపోతే వీరిద్దరు కలుసుకోవడానికి కారణం అమెజాన్ సిఇఓ సీఈవో జెఫ్ బెజోస్.  

వాషింగ్ట‌న్‌లో ఆయన ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక పార్టీకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధనికులు హాజరయ్యారు. వేడుకలో మల్లికా శెరావత్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, ప్రముఖలతో మాట్లాడుతూ ఆమె ఫొటోలకి పీజులివ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మల్లికా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. టెలివిజన్ షోలతో ఐటెమ్ సాంగ్స్ తో ఒకప్పుడు ఫుల్ బిజీగా కనిపించిన ఆమె చివరగా 2019లో భూ సబ్కి పతెగి అనే వెబ్ సిరీస్ లో నటించింది.