Asianet News TeluguAsianet News Telugu

చిరు సరసన బాలీవుడ్ బ్యూటీ.. ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి రౌటెలా స్పెషల్ సాంగ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ అందింది. చిరు సరసన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటించబోతుందని, అదీ స్పెషల్ సాంగ్ లో కన్ఫమ్ అయ్యిందని ప్రకటించారు. 
 

Bollywood Actress Urvashi Rautela spectial song in Valtair Veerayya!
Author
First Published Nov 4, 2022, 2:40 PM IST

మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ (Valtair Veerayya). చిత్రానికి  బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మెగాఫ్యాన్స్ కు కిక్కిచ్చే అప్డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు. తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన గ్లామరస్ దివా ఊర్వశి రౌటెలా (Urvashi Rautela)ల నటించబోతున్నట్టు తెలుస్తోంది.  స్పెషల్ సాంగ్ లో గ్లామర్ స్టెప్పులతో అదరగొట్టబోతున్నారని అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ ఓ భారీ సెట్‌ను కూడా వేయించినట్టు తెలుస్తోంది.  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ను అద్భుతమైన స్కోర్ అందించారని.. థియేటర్లలో దుమ్ములేచిపోతుందని అంటున్నారు. టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సాంగ్ ను మరింత ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ అంచనాలను పెంచుతూనే ఉంది.  ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ మరియు ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా బెస్ట్ రిజల్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios