బాహుబలి అనంతరం అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని చూసిన ప్రభాస్ కి సాహో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రాధ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.  రొమాంటిక్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమాకు సంబందించిన గాసిప్స్ రోజుకొకటి పుట్టుకొస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ వాటిపైన పెద్దగా స్పందించడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో ఒక సీనియర్ నటీమణి ప్రభాస్ తల్లిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కూడా బాలీవుడ్ లో ఒకప్పుడు హాట్ హీరోయిన్స్ గా కుర్రకారును ఆకర్షించిన భాగ్య శ్రీ.  50ఏళ్ల వయసొచ్చినా కూడా ఇంకా కుర్ర హీరోయిన్స్ కి తన అందంతో సవాల్ విసురుతూనే ఉంది. ఆమె కుమారుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే భాగ్య శ్రీ తెలుగులో బాలకృష్ణ రాణా(1998)సినిమాలో హీరోయిన్ గా చేసిన తరువాత టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేసింది లేదు. ఇక చాలా కాలం తరువాత ఆమె మళ్ళీ ప్రభాస్ తల్లి పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఆడియెన్స్ లో అంచనాల డోస్ పెంచింది. ఇదే ఏడాది సినిమాని విడుదల చేయాలనీ ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.