కరోనా వైరస్ ఉధృతి నానాటికి ఎక్కువవుతుంది. సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరినీ కుదిపేస్తోంది. తాజాగా లెజెండరీ ఆక్టర్ రేఖ బిల్డింగ్ ని కూడా ముంబై అధికారులు సీల్ చేసారు. 

ఆమె సెక్యూరిటీ గార్డ్ కి కరోనా వైరస్ సోకడంతో ఆ బిల్డింగ్ ని సీల్ చేసారు. ఆ బిల్డింగ్ బయట కంటైన్మెంట్ జోన్ అని నోటీసు ను అంటించడం జరిగింది. ఇకపోతే అమితాబ్ బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. 

‘‘నాకు కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నానని బిగ్ బీ ట్వీట్ చేశారు. తన కుటుంబసభ్యులు, సిబ్బందికి టెస్టులు నిర్వహించారని, ఇందుకు సంబంధించిన ఫలితాలు రావాల్సి వుందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. అలాగే తనను గత పది రోజులుగా కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అమితాబ్ విజ్ఞప్తి  చేశారు. మరోవైపు ఆయనకు కరోనా వైరస్ సోకడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది.