కరోన కారణంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. వైరస్‌ సోకి జనం బిక్కు బిక్కు మంటుంటే వారికి సేవలందిస్తున్న వైద్యులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని జీవితం వెళ్లదీస్తున్నారు. చాలా మంది వైద్యులు తమ కుటుంబాలను కలిసేందుకు కూడా ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. అలాంటి వారంతా హాస్పిటల్స్‌లోనే ఏదో ఒక మూలన సేదతీరుతున్నారు.

అయితే అలాంటి వైద్య సిబ్బందికి సదుపాయాలు కల్పించేందుకు ముందుకు ఓ స్టార్ యాక్టర్‌ ముందుకు వచ్చాడు. హిందీతో పాటు సౌత్‌లోనూ స్టార్ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ ముంబైలో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ కష్టకాలంలో తన హోటల్‌ను వైద్య సిబ్బంది వసతి కోసం వినియోగించుకోవాల్సిందిగా కోరాడు సోనూ సూద్‌. ఈ మేరకు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు లేఖ రాశాడు సోనూ.

ఇప్పటికే బాలీవుడ్‌ బాద్ షా షారూఖ్‌ ఖాన్‌ కూడా ఓ 4 అంతస్థుల భవంతిని పేషంట్లను క్వారెంటైన్ చేసేందుకు వినియోగించుకునేందుకు ఇచ్చాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ ఏకంగా లక్ష కుటుంబాలకు భోజన వసతి కల్పిస్తుండగా కిలాడీ అక్షయ్ కుమార్ 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🙏

A post shared by Sonu Sood (@sonu_sood) on Apr 9, 2020 at 1:48am PDT