బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమించింది. ఆయనను ముంబైలోని కోకిలబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలోని ఐసియులో చేర్చారు. ఇటీవల ఇర్ఫాన్ ఖాన్ తల్లి మరణించారు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమించింది. దీంతో అతన్ని ముంబైలోని కోకిలబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కోలన్ ఇన్ ఫెక్షన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ ను కోకిలబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలోని ఐసియులో చేర్చిన విషయం వాస్తవమేనని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు. ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పారు. ఇర్ఫాన్ ఖాన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. 

తనకున్న శక్తి, ధైర్యం కారణంగా ఇప్పటి వరకు పోరాటం చేస్తూ వచ్చారని, ఆయన కోలుకోగలరనే నమ్మకం ఉందని అన్నారు. 2018లో ఇర్ఫాన్ ఖాన్ కు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. చికిత్స కొసం తాను లండన్ వెళ్లినట్లు కూడా తెలిపారు. 

ఏడాది పాటు వేరే దేశంలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ నిరుడు ముంబైకి తిరిగి వచ్చారు. అంగ్రేజీ మీడియం సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. అ సినిమా ఈ ఏడాది విడుదలైంది. చికిత్స కోసం మరోసారి విదేశాలకు వెళ్లాల్సి రావడంతో ఆ సినిమా ప్రమోషన్ చేయలేకపోయారు. 

కొద్ది రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా బేగం జైపూర్ లో మరణించారు. ఆమె వయస్సు 95 ఏళ్లు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుండడం వల్ల ఆమె అంత్యక్రియలకు ఆయన వెళ్లలేకపోయారు.