సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఒక్కప్పటి హీరో అర్జున్ రాంపాల్. అవకాశం వచ్చిన  ప్రతిసారి స్క్రీన్ పై సత్తా చాటుతున్న అర్జున్ చాలా రోజుల తరువాత మళ్ళీ వార్తల్లో నిలిచాడు. మొత్తానికి తన సతీమణి జెసియా నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకున్నాడు.  21ఏళ్ల పాటు సాగిన వీరి జీవితానికి విడాకులుతో తెరపడింది.

మరోవైపు అర్జున్ రాంపాల్ రెండో వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యాడు. గత ఏడాది విడాకుల కోసం బాంద్రా కోర్టును ఆశ్రయించగా తాజాగా న్యాయస్థానం ఇరువురి నిర్ణయాలతో విడాకులు మంజూరు చేసింది. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో అర్జున్ ని మీడియా ప్రశ్నించగా ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయారు.

వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు తల్లీ దగ్గరే ఉంటారని కోర్టు తెలిపింది. గత ఏడాది విడాకుల తీసుకుంటున్నట్లు చెప్పిన అర్జున్ వివాహ జీవితంలో ఎన్నో ఏళ్ళు నరకం చూశానని చెప్పారు. ఇక ఇప్పుడు తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో అర్జున్ ఫ్యామిలీ లైఫ్ ని కొనసాగిస్తున్నాడు. 1998లో మెహ్ర్ ని వివాహం చేసుకున్న అర్జున్ కి ఇప్పుడు టీనేజ్ వయసొచ్చిన ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

కానీ అర్జున్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ విషయమేమిటంటే.. తన గర్ల్ ఫ్రెండ్ ని టీనేజ్ కూతుర్లు యాక్సెప్ట్ చేసినట్లు అర్జున్ స్వయంగా వెల్లడించాడు.అంతేకాదు.. తన భార్య కారణంగా ఐదేళ్ల పాటు నరకం చూశానని చెప్పాడు. రెండేళ్ల పాటు తన విదేశీ గర్ల్ ఫ్రెండ్ తో రహస్యంగా డేటింగ్ చేసిన అర్జున్ ఆ తరువాత ఓపెన్ అయిపోయాడు.