బోల్డ్ సినిమాలతో క్రేజ్ సంపాదించిన నటి షకీలాకి బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ పూజా భట్ కి సిగరెట్ కనెక్షన్ ఉందట. ఈ విషయాన్ని పూజా భట్ స్వయంగా వెల్లడించింది. తనకు సిగరెట్ అలవాటు చేసింది పూజా భట్ అనే విషయాన్ని షకీలా బయటపెట్టింది. సిగరెట్ తాగడాన్ని ఓ స్టయిల్ లా స్టార్ట్ చేశానని, ఇప్పుడు వదల్లేకపోతున్నానని తెలిపింది. ఆర్టిస్ట్ పూజా భట్ ఓసారి షూటింగ్ కోసం చెన్నై వచ్చినప్పుడు ఆమె సిగరెట్ తాగుతుంటే చూసిన షకీలా చాలా స్టైల్ గా ఉందని అనుకున్నారట.

అప్పుడు పూజా భట్ తనను పిలిచి, సిగరెట్ తాగమని ఇచ్చిందట. అలా తనకు సిగరెట్ అలవాటు అయిందని.. ఇప్పుడు మానేయాలని అనుకుంటున్నా.. తన వల్ల కావడం లేదని చెప్పుకొచ్చింది. దాదాపు ముప్పై ఏళ్లుగా సిగరెట్ తాగుతూనే ఉన్నానని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా.. పెళ్లిపై కూడా కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది షకీలా. తన లైఫ్ లో చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని.. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెప్పింది.

ముప్పైలలో ఒకరిని ప్రేమించినట్లు చెప్పిన షకీలా.. కొన్ని కమర్షియల్ సినిమాలు చేసిన తరువాత అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ తన తల్లి ఒప్పుకోకపోవడంతో కుదరలేదని.. ఆ అమయంలో తనకు కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయని.. అమ్మ మీదకోపంతో రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత పూర్తిగా పెళ్లి గురించి ఆలోచించడం మానేశానని తెలిపింది. 

పెళ్లి చేసుకుంటే ప్రైవసీ పోతుందని.. ఏం చేయలన్నా.. భర్త అనుమతి తీసుకొని చేయాలని చెప్పింది. ఒకానొక సమయంలో తన బాయ్ ఫ్రెండ్స్ కట్టడి చేయడం మొదలు పెట్టారని.. పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని ఆంక్షలు పెడతారోనని చేసుకోలేదని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటే విడాకులుగ్యారంటీ అనే విషయం తనకు తెలుసనీ, అందుకే సింగిల్ గానే ఉండిపోయానని చెబుతోంది షకీలా.

నా స్మోకింగ్ కి తనే కారణం.. పూజా భట్ పై షకీలా కామెంట్స్!

తన లైఫ్ లో ఏడెనిమిది మందిని ఇష్టపడినట్లు చెప్పిన ఆమె.. వాళ్లను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం పూర్తిగా తనదేనని స్పష్టం చేసింది. ఇప్పటికీ కూడా ఆ ఎనిమిది మంది తమ కుటుంబాలతో ఇంటికి వస్తుంటారని చెప్పింది.