2012లో లవ్ ఫెయిల్యూర్ చిత్రంతో నటుడిగా బాబీ సింహా పరిచయమయ్యాడు. అతడి నటనకు తగ్గట్లుగా మంచి అవకాశాలు బాబీని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం బాబీ తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో బిజీ స్టార్. నాటిదిగా బాబీ సింహా స్థాయిని పెంచిన చిత్రం జిగర్తాండ. ఆ చిత్రంలో బాబీ సింహా విలన్ గా అదరగొట్టేశాడు. 

ఇక బాబీ సింహా 2016లో తమిళ నటి రేష్మి మీనన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. పాప పేరు మధుర సింహా. ఇదిలా ఉండగా రేష్మి మీనన్ రెండవసారి గర్భం దాల్చిన ఫోటోలు మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

రీసెంట్ గా తన సీమంతం ఫోటోలని రేష్మి మీనన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజా సమాచారం మేరకు రేష్మీ మీనన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. దీనితో బాబీ సింహా, రేష్మీ మీనన్ దంపతులు రెండవసారి తల్లిదండ్రులు అయ్యారు. 

బాబీ సింహా తన కెరీర్ లో పిజ్జా, జిగర్తాండ, పేట, రన్, సామీ 2 లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. జిగర్తాండ చిత్రానికి గాను బాబీ సింహా ఉత్తమ విలన్ గా అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. 

దర్శకుడు హరీష్ శంకర్ ఈ జిగర్తాండ చిత్రానికే కొంచెం మార్పులు చేసి తెలుగులో గద్దలకొండ గణేష్ గా తెరక్కించాడు. బాబీ సింహా పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో హరీష్ శంకర్ వరుణ్ తేజ్ పాత్రని హైలైట్ చేశాడు.