ఆదిలాబాద్: ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ గెటప్ మీద బిజెపి ఎంపీ సోయం బాపూరావు మరోసారి మండిపడ్డారు. కొమురం భీమ్ వేషధారణలోని ఎన్టీఆర్ కు ఒక మతానికి చెందిన టోపీ పెట్టారని, కొమురం భీమ్ ఎప్పుడూ ఆలా లేడని ఆయన అన్నారు. ఎన్టీఆర్ నీళ్లలోంచి వస్తూ ఆ టోపీ ధరించినట్లు చూపించారని ఆయన అన్నారు.

దర్శకుడు రాజమౌళితో తాను మాట్లాడడానికి ప్రయత్నించానని, ఆయన అందుబాటులో లేరని సోయం బాపూరావు అన్నారు. సన్నివేశాలు ఆదివాసీలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.

సన్నివేశాలు ఆదివాసీలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాజమౌళికి తాను హెచ్చరిక చేస్తున్నట్లు తెలిపారు. మొండిగా సినిమాను విడుదల చేస్తే థియేటర్లపై ఆదివాసీలు దాడి చేస్తారని ఆయన అన్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామచరణ్ అల్లూరి సీతారామారాజుగా నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. దానిపై సోయం బాపూరావు మండిపడుతున్నారు. 

హైదరాబాదు నిజాంకు వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాటం చేశాడు. జల్, జంగిల్, జమీన్ కోసం ఆ పోరాటం చేశాడు.