ఓ చానల్‌లో ‘తీన్మార్’ అనే కార్య‌క్రమంతో అందరినీ అలరించిన బిత్తిరి స‌త్తి వెండితెర‌పై క‌థానాయికుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. గౌరవ మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ ఈ సినిమాను నిర్మించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఓ పాత్ర కూడా పోషించారు. ‘బతుకమ్మ’ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ 
సినిమాకి 'తుపాకీ రాముడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేయించారు.

తాజాగా సినిమా టీజర్ ని విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయించి చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అతడిని ఆహ్వానించారు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 20వ తేదిన హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ జూబ్లిహిల్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తప్పక హాజరు కావాలని హీరో విజయ్ దేవరకొండను రసమయి బాలకిషన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు.

సినిమా టీజర్ అయితే చెప్పుకునే స్థాయిలో లేదు కానీ ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు విడుదల చేయడానికి ముందుకు వచ్చారు.అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియ, ఆర్.ఎస్.నందా, గౌతంరాజు, రవి, ఆదేష్, అంబటి వెంకన్న, అనురాగ్ పోశం, మాధవి, గాయత్రి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహ‌కుడిగా  సురేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. 

మాటలు: సిద్దార్థ, రవి ఆదేష్,
ఎడిటింగ్: జె.పి, 
పాటలు: అభినయ శ్రీనివాస్, 
మిట్టపల్లి సురేందర్, 
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మక్కపాటి చంద్రశేఖర్‌రావు, మక్బుల్ హుస్సేన్, 
నిర్మాత: రసమయి బాలకిషన్,
రచన, సంగీతం,దర్శకత్వం: టి.ప్రభాకర్.