బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య
బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుంది.

చెన్నై: బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇంట్లో ఉరేసుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. విజయ్ ఆంటోనీ కూతురు లారా చర్చ్ పార్క్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది.
బిచ్చగాడు సినిమా ద్వారా విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చెన్నైలోని డిడికె రోడ్డులో నివాసం ఉంటున్నాడు.
లారా ఎలక్ట్రిక్ ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విజయ్ ఆంటోనీ దంపతులు కూతురిని ఆ ప్రైవేట్ ఆసత్రికి తరలించారు. అయితే, లారా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
డిప్రెషన్ కారణంగా లారా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.