హీరోయిన్ బిందుమాధవి తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో బిందుమాధవి హీరోయిన్ గా మారింది. బిందుమాధవి హీరో రామ్ నటించిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

ఇటీవల తెలుగు చిత్రాలు తగ్గించిన బిందుమాధవి పూర్తిగా తమిళ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. ఆమె నివాసం ఉంటోంది కూడా చెన్నైలోనే. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా ప్రభావం నానాటికి పెరుగుతూనే ఉంది. 

హీరోయిన్ బింధుమాధవిపై కరోనా ప్రభావం పడింది. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోని ఓ ఇంట్లో ఒకరికి కరోనా సోకింది. దీనితో అధికారులు రంగంలోకి దిగి ఆ అపార్ట్మెంట్ ని సీల్ చేశారు. అందులో ఉంటున్న వారందరిని క్వారంటైన్ లో ఉంచారు. ఇక బిందు మాధవి కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళింది. 

ఈ విషయాన్ని బిందుమాధవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మేముంటున్న అపార్ట్మెంట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో మేమంతా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాం. 14 రోజుల పాటు తానూ క్వారంటైన్ లో ఉండబోతున్నట్లు బిందుమాధవి తెలిపింది.