విజయ్ కెరీర్ లనే అత్యంత భారి బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బిగిల్. ఎప్పుడు లేని విధంగా విజయ్ సినిమా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజయింది. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమా ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా సినిమా 250కోట్ల మైలురాయిని అందుకుంది.

Read also: బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నకోలీవుడ్ హీరోస్.. 200కోట్లకు పైనే

సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం చూస్తుంటే విజయ్ క్రేజ్ ఎంతవరకు ఉందొ అర్ధం చేసుకోవచ్చు.  అట్లీ కాంబినేషన్ లో విజయ్ మూడవసారి నటించడంతో మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. అంచనాల డోస్ ని ముందే గ్రహించిన నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా 180కోట్లు ఖర్చు చేసి మరీ సినిమాని నిర్మించారు.

ఇకపోతే తెలుగులో సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. హాలిడేస్ ఎండ్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే కలెక్షన్స్ తగ్గుతున్నాయి. గతంలో విజయ్ సర్కార్ కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి.  అయితే తమిళనాడులో మాత్రం విజయ్ మ్యానియా ఏ మాత్రం తగ్గడం లేదు.

వీకెండ్ తరువాత కూడా ఆ డే ఫ్లోలో కలెక్షన్స్ కొనసాగుతున్నాయి. దర్శకుడు అట్లీ డ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సీన్స్ డిజైన్ చేయడం సినిమాకు బాగా ఉపయోగపడింది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన తేరి - మెర్శల్ - సినిమాలు కూడా ఇదే తరహాలో క్లిక్కయ్యాయి.

ఇక విజయ్ సర్కార్ సినిమాతో రెండువందల కోట్ల మార్క్ ని ఈజీగా అందుకున్నాడు. ఇప్పుడు బిగిల్ కూడా 250కోట్లతో విజయ్ మార్కెట్ మరింత బూస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఈ స్టార్ హీరో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీతో రాబోతున్నాడు.