టాలీవుడ్ లో ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు యాంటీ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. అభిమానుల హడావిడి ఎంత ఉన్నా కూడా నెగిటివ్ ఫ్యాన్స్ వల్ల మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పాలి. ఇక కోలీవుడ్ లో  అయితే ఆ డోస్ మరింత ఎక్కువైంది. విజయ్ బిగిల్ సినిమాకు నెగిటివ్ ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి.

ఓ నెగిటివ్ ట్యాగ్ ని ఇటీవల ట్విట్టర్ ట్రేండింగ్ అయ్యేలా చేశారు అంటే ఆ డోస్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అజిత్ ఫ్యాన్ విజయ్ ఫ్యాన్స్ కి మధ్య వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మా హీరో ఎక్కువ అంటే,, మా హీరో ఎక్కువ.. అని గొడవపడుతున్నారు. ఇకపోతే నెగిటివ్ ప్రచారాలు ఎన్ని ఉన్నా బిగిల్ బిజినెస్ పై అంతగా ప్రభావం చూపడం లేదు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సాలిడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారా సినిమాకు 45కోట్ల లాభం చేకూరింది.

శాటిలైట్ ద్వారా 25కోట్లు అందుకున్న బిగిల్ నిర్మాతలు అదే తరహాలో డిజిటల్ రూపంలో 20కోట్ల డీల్ ని సెట్ చేసుకున్నారు. 180కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బిగిల్ సినిమాకు ఇది మంచి రేట్ అని చెప్పవచ్చు. గతంలో విజయ్ల్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త వండర్స్ ని క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు బిగిల్ ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.