కంటెస్టెంట్స్ పై బిగ్ బాస్ మండింది. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో నుండి వెళ్లిపోండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ చర్యతో అందరి ముఖాలు తెల్లబోయాయి.


కంటెస్టెంట్స్ ఆటతీరుపై బిగ్ బాస్ అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఇంటి సభ్యుల పెర్ఫార్మన్స్ నచ్చని బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా సెలెబ్రిటీ గేమ్ కండక్ట్ చేశారు. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు బిగ్ బాస్ సూచించిన హీరో, హీరోయిన్స్ సినిమా గెటప్స్ వేయాలి. అలాగే సదరు హీరో, హీరోయిన్ ని అనుకరించాలి. 

గీతూ పుష్ప శ్రీవల్లి, ఆదిరెడ్డి పుష్పరాజ్, రోహిత్ బాహుబలి ప్రభాస్, మెరీనా అనుష్క దేవసేన, శ్రీహాన్ బాలయ్య, రాజశేఖర్ ప్రభాస్, రేవంత్ చిరంజీవి ఇలా స్టార్ హీరోలు, హీరోయిన్స్ గెటప్స్ కంటెస్టెంట్స్ వేయడం జరిగింది. సదరు గెటప్స్ లో కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. కాగా ఈ టాస్క్ అనుకున్నట్లుగా సాగలేదు. వినోదం పంచడంలో కంటెస్టెంట్స్ ఫెయిల్ అయ్యారు. అదే సమయంలో వారికి టాస్క్ పట్ల పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. 

ఇది బిగ్ బాస్ ని తీవ్ర అసహనానికి గురి చేసింది. 15 మంది కంటెస్టెంట్స్ ని గార్డెన్ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్... గేమ్ పట్ల ఆసక్తి లేనివారు మెయిన్ డోర్ నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోవచ్చని వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ చెప్పినట్లు మెయిన్ డోర్ ఓపెన్ కావడంతో కంటెస్టెంట్స్ షాక్ తిన్నారు. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మరి బిగ్ బాస్ వార్నింగ్ కి కంటెస్టెంట్స్ ఎలా రెస్పాండ్ అయ్యారనేది ఎపిసోడ్లో చూడాలి. 

ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. మెజారిటీ సభ్యులు రేవంత్, బాల ఆదిత్యను నామినేట్ చేశారు. అనూహ్యంగా హౌస్ ఈ వారం 13 మంది నామినేట్ అయ్యారు. గీతూ, కెప్టెన్ సూర్యను మినహాయిస్తే మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. షో ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం సుదీప ఎలిమినేటైన విషయం తెలిసిందే.