బిగ్ బాస్ నాలుగవ సీజన్ అట్టహాసంగా ప్రారంభమయింది. నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో లో గత సీజన్ లో అనుసరించిన ఫార్ములానే అనుసరించినట్టుగా అర్థమవుతుంది. కంటెస్టెంట్లలో వేరియేషన్ చూపెడుతూనే గత సారి ఏ రంగాలకు చెందినవారిని పిలిచారో ఈ సారి కూడా అదే రంగానికి చెందినవారిని పిలిచారు. 

గత పర్యాయం తీన్మార్ సావిత్రి ఉరఫ్ శివజ్యోతి వచ్చి తెలంగాణ యాసలో అదరగొడితే... మరో అచ్చ తెలంగాణ యాంకర్ ని ఈసారి కంటెస్టెంట్ గా దింపారు.  ఈ పర్యాయం జోర్దార్ సుజాత అదే కేటగిరీలో రంగప్రవేశం చేసింది. అచ్చం తెలంగాణ యాసలో అదరగొడుతూ అయిదవ హౌజ్ మేట్ గా ఎంటర్ అయింది. 

జోర్దార్ సుజాత కూడా తన ప్రయాణాన్ని ఒక్క మాటలో చెబుతూ స్పెషల్ ఏవీ లో తన జీవితం ఎలా సాగిందో, ఎన్ని కష్టాలకోర్చి ఈ స్థితికి చేరుకుందో తెలిపింది. శివజ్యోతి మాదిరిగా సుజాత అలియాస్ శృతి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే కనబడుతుంది. 

ఇక మరో కంటెస్టెంట్ గా కవర్ సాంగ్స్ చేసుకునే మెహబూబ్ దిల్ సి ఎంటర్ అయ్యాడు. తన జీవితంలోని కష్టాలను గురించి చెప్పిన మెహబూబ్... నాగార్జున మాస్ పాటకు స్టెప్పులేసి హౌజ్ లోకి ఎంటర్ అయ్యాడు. 

గత పర్యాయం కూడా ఆశు రెడ్డి ఇదే కేటగిరీ నుండి వచ్చింది. అంతకుముందు సీజన్ లో అచ్చంగా ఇదే కేటగిరీ కి చెందిన దీప్తి సునైనా వచ్చింది. బిగ్ బాస్ మరోమారు ఇదే ఫార్ములాను ఫాలో అయింది. 

ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ గా దేవి నాగవల్లి వచ్చింది. టీవీ యాంకర్ వస్తూనే తనకు బిగ్ బాస్ గెలవడం ఒక్కటే లక్ష్యం అని, హౌజ్ లోన్ వంటింటివి చాలా ఉన్నాయని, డబ్బు కోసమే వచ్చానని తెలిపింది. 

గత సీజన్లో అంతకు ముందు కూడా ఇదే క్యాటగిరి నుండి మనకు టీవీ9 దీప్తి, జాఫర్ వచ్చారు. ఈ సీజన్లో దేవి నాగవల్లిని తీసుకొచ్చారు. న్యూస్ యాంకర్ కేటగిరీల్లో మరోసారి పాత ఫార్ములానే ఫాలో అయ్యాడు బిగ్ బాస్. 

ఇక ఆ తరువాత సోషల్ మీడియా సెలబ్రిటీ దేత్తడి హారిక వచ్చింది. గతంలో మహేష్ విట్టా, ఆశు రెడ్డిల మాదిరే ఈసారి హారిక వచ్చింది. ఆంచారు అరియనా గ్లోరీ, లాస్య, డైరెక్టర్ కిరణ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నటుడు అభిజిత్. ఇక వచ్చే కంటెస్టెంట్లందరు కూడా అదే ఫార్ములా నుంచి వచ్చేవారిగానే ఉందనున్నట్టు తెలుస్తుంది. గత పర్యాయం బాబా భాస్కర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ కేటగిరీలో మనకు కనబడితే... ఈసారి అమ్మ రాజశేఖర్ వచ్చారు. 

కాకపోతే బిగ్ బాస్ ని మరింత ఇంటరెస్టింగ్ గా ఉంచేందుకు కనెక్షన్ కాన్సెప్ట్, నెయిబర్ హౌజ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు బిగ్ బాస్. చూడాలి మున్ముందు ఇంకా ఎవరు వస్తారో ఇంకెలాంటి కొత్త కాన్సెప్ట్స్ ఈ సీజన్ లో ఉంచుతారో...!