ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంబిస్తున్న నేపథ్యంలో చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా ప్రజలు వణికిపోతున్నారు. సాధారణ జ్వరం వచ్చినా భయంతో హస్పిటల్స్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ బిగ్ బాస్‌ పార్టిసిపెంట్, నృత్యకారిణి, నటి సంభావనా సేథ్‌ మే 4న అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బిగ్ బాస్‌ రెండు సీజన్లలో పాల్గొన్న సంభావనకు నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.

దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారన్న వార్త తెలిసేసరికి కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది. అయితే రాత్రంతా హాస్పిటల్‌లో ఉండి వచ్చిన తరువాత కూడా ఆమె అనారోగ్యం తిరగబెట్టడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సంభావన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ ద్వారా వెల్లడించారు. ఈ బ్యూటీ సంభావనా సేథ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ను నిర్వహిస్తుంది. సంభావన ఆరోగ్యం బాగా లేకపోవటంతో చానల్‌ లో అప్‌డేట్స్‌ ఉండవని తెలియజేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) on May 4, 2020 at 11:16pm PDT